Arvind Kejriwal: జగన్ ను ప్రశంసిస్తూ కేజ్రీవాల్ లేఖ

  • దిశ చట్టంపై కేజ్రీవాల్ ప్రశంసలు
  • బాధితులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్య
  • బిల్లు ప్రతిని పంపించాలని విన్నపం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'దిశ' చట్టంపై జగన్ ను కేజ్రీవాల్ అభినందించారు. ఇలాంటి చట్టాలతో బాధితులకు న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. దిశ చట్టం బిల్లు ప్రతిని తనకు పంపించాలని కోరారు.

ఏపీ దిశ యాక్ట్ ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తిపై 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి... సరైన ఆధారాలు ఉంటే... 21 రోజుల్లో శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై తీవ్ర నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుంది. సోషల్ మీడియా లేదా ఫోన్లలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు.
Arvind Kejriwal
AAP
Jagan
YSRCP

More Telugu News