ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
- ఇళ్ల నిర్మాణంపై అట్టుడికిన అసెంబ్లీ
- ప్రభుత్వ సమాధానాలు సరిగా లేవంటూ టీడీపీ వాకౌట్
- టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న బొత్స
దీనికి సమాధానంగా, సభలో టీడీపీ అన్నీ అబద్ధాలే చెబుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జాబితా నుంచి అర్హులైన లబ్ధిదారులను తొలగించామంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని... అందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ లో రూ. 150 కోట్లు మిగిలిందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రతి ఇంటికి రూ. 75 వేలు ఆదా అయిందని అన్నారు.