కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు
Add ap7am to your home Screen

కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

  • మార్ఫింగ్ ఫొటో ఎఫెక్ట్..స్పందించిన సైబర్ క్రైమ్ పోలీస్
  • రామ్ గోపాల్ వర్మకు నోటీసులు 
  • రేపు తమ ఎదుట హాజరుకావాలన్న పోలీసులు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై  సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వర్మకు నోటీసులు పంపారు. రేపు తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

కాగా,‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేశారు. గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి పాల్ దిగిన ఈ ఫొటోను మార్ఫింగ్ చేశారని  పోలీసులకు ఇటీవలే ఆయన ఫిర్యాదు చేశారు.
KA Paul
Ram gopal varma
cyber crime police

More Telugu News