నేను బీజేపీలో చేరాల్సిన అవసరం లేదు: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
- వైసీపీలో తనకు సముచిత గౌరవం ఉంది
- జగన్మోహన్ రెడ్డికి నాకు సాన్నిహిత్యం ఉంది
- గతంలో బీజేపీలో నాలుగేళ్లు ఉన్నాను
కేవలం ఒక్కసారి ఎంపీగా గెలిచిన మీకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, సీఎం జగన్ సిఫారసు చేశారు కనుకనే తనకు ఈ పదవి వచ్చిందని స్పష్టం చేశారు.
‘రాజు గారు ఎలా ఉన్నారు?’ అంటూ ప్రధాని మోదీ మిమ్మల్ని పలకరించేంతటి సాన్నిహిత్యానికి కారణం? అనే ప్రశ్నకు రఘురామ కృష్ణంరాజు బదులిస్తూ, గతంలో మోదీని చాలాసార్లు కలిశానని, ఎదురుపడ్డప్పుడు ‘నమస్కారం’ చేస్తుంటానని చెప్పారు.
‘మీకు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చే వైసీపీ నేతలు ఉన్నారా?’ అని అడగగా ఆయన చెబుతూ, ఈ విషయంలో అనుమానం ఎందుకు? జగన్ కు, తనకు మధ్య లేనిపోనివి క్రియేట్ చేయాలని చూసే ఇద్దరు ముగ్గురు ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విజ్ఞత గల నేత కనుక ఇలాంటి వాటిని నమ్మరని స్పష్టం చేశారు.