బాపట్లలో మూడు చేతులతో జన్మించిన వింత శిశువు!
- మేనరిక వివాహంతో జన్యు లోపాలు
- శిశువు బతికే అవకాశాలు లేవు
- తొలి కాన్పులో కాళ్లు, చేతులు లేకుండా బిడ్డ
ఐదో నెలలో స్కానింగ్ చేసిన సమయంలో ఈ లోపాన్ని గుర్తించలేదని, ఆపై ఎనిమిదో నెలలో గమనించినా, అప్పటికే ఆలస్యం కావడంతో గర్భస్రావం చేయలేకపోయామని అన్నారు. ఆ మహిళకు సాధారణ కాన్పే జరిగిందని, శిశువు ఆరోగ్యం విషమంగా ఉందని, బతికే అవకాశాలు స్వల్పమని అన్నారు. ఇదే దంపతులకు మూడు సంవత్సరాల క్రితం తొలి కాన్పులో కాళ్లు, చేతులు లేకుండా మగబిడ్డ పుట్టి చనిపోయాడని ఆమె తెలిపారు.