22 ఏళ్లకే ఐపీఎస్ అధికారైన గుజరాత్ యువకుడు!
- అత్యంత పిన్న వయసులో ఐపీఎస్ అధికారిగా హసన్ రికార్డు
- ఈ నెల 23న జామ్ నగర్ ఏఎస్పీగా బాధ్యతల స్వీకరణ
- గత ఏడాది యూపీఎస్సీ పరీక్షల్లో 570 ర్యాంకు పొందిన హసన్
ఈ సందర్భంగా హసన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యం ఉండేది. అది సాధ్యం కాలేదు. చివరకు ఐపీఎస్ గా సేవలు చేసేందుకు నిర్ణయించుకున్నా. నా తల్లి నసీంబాను,తండ్రి ముస్తఫాలు ఓ వజ్రాల కంపెనీకి చెందిన చిన్నయూనిట్లో పనిచేస్తుంటారు. వారితో పాటు నా కల నెరవేరటానికి పలువురు వ్యాపారులు ఆర్థిక సాయం చేశారు. వారికి రుణపడి ఉంటాను’ అని చెప్పాడు.