నా కూతురిని చంపిందెవరో ఎమ్మెల్యే రోజాకు తెలుసు: ఆయేషా మీరా తల్లి
- ఆయేషా హత్యకు గురైన తర్వాత రోజా చాలా హడావుడి చేశారు
- నేరస్తుల గురించి రోజా ఎందుకు మాట్లాడటం లేదు
- నాయకులు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలు
నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలని శంషాద్ బేగం అన్నారు. మధ్యతరగతి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు. నేరస్తుల గురించి గతంలో తాను ఒకసారి మాట్లాడితే కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారని... తమ వద్ద కోటి పైసలు కూడా లేవని... ఎలాంటి దావా అయినా వేసుకోవచ్చని అన్నారు. విచారణలో నిజాలు వెలుగు చూస్తే... ఎవరు కోటి రూపాయలు చెల్లించాలో, ఎవరు శిక్ష అనుభవించాలో తెలుస్తుందని చెప్పారు.
న్యాయం కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నానని శంషాద్ బేగం తెలిపారు. మన దేశంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందని చెప్పారు. 21 రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఈ కేసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయేషా చట్టాన్ని తీసుకురావాలని అన్నారు.