నైజర్ లో ఉగ్రవాదుల భీకర దాడి... 71 మంది సైనికుల దుర్మరణం!
- పశ్చిమ నైజర్ మిలిటరీ బేస్ పై దాడి
- 12 మందికి తీవ్రగాయాలు
- 2017 తరువాత అతిపెద్ద దాడి
కాగా, అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ గ్రూపులకు సంబంధించిన ఉగ్రవాదులు ఈ దాడి చేసుండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ హై రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ దాడిలో పాల్గొనేందుకు చాలా మంది ఉగ్రవాదులు వచ్చారని, ఎంత మంది పాల్గొన్నారన్న విషయమై ఆరా తీస్తున్నామని నైజర్ రక్షణ మంత్రి ఇసౌఫూ కటాంబే వ్యాఖ్యానించారు. అక్టోబర్ 2017లో టాంగో టాంగో ప్రాంతంలో జీహాదీలు దాడి చేసి, తొమ్మిది మంది యూఎస్, నైజర్ సైనికులను చంపేసిన తరువాత, జరిగిన మరో పెద్ద దాడి ఇదే!