ఏపీ ప్రభుత్వ నిర్ణయం భేష్.. కేసీఆర్ కూడా ఈ విషయంపై ఆలోచించాలి: డీకే అరుణ
- మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామం
- తెలంగాణలో కూడా మద్య నిషేధానికి సమయం ఆసన్నమైంది
- అత్యాచారాలకు మద్యమే కారణం
దిశ, మానస, సమతలపై అత్యాచారాలకు మద్యమే కారణమని డీకే అరుణ అన్నారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బెల్టు షాపులు పెరిగిపోతున్నా కేసీఆర్ కు కనిపించడం లేదని విమర్శించారు. ఉద్యమం సమయంలో చెప్పిన మాటలను కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. యువతను పెడదారి పట్టిస్తున్న పబ్ లు, క్లబ్ లను నిషేధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.