అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై చెప్పిందే చేశాం: మోదీ
- జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగం
- ఎన్నో ఏళ్లుగా అయోధ్య సమస్య ఉంది
- శాంతియుతంగా పరిష్కరిస్తామని మేము హామీ ఇచ్చాము
- రామ మందిర నిర్మాణానికి ఇప్పుడు మార్గం సుగమమైంది
దేశంలోని ప్రజలందరికీ బీజేపీపై నమ్మకం ఉందని, తాము ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మోదీ అన్నారు. 'పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు ఆజ్యం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చర్యలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు. దీనివల్ల అసోంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషకు ఎటువంటి నష్టం జరగబోదని నేను హామీ ఇస్తున్నాను' అని మోదీ వ్యాఖ్యానించారు.