తలైవా సర్.. హ్యాపీ బర్త్ డే: రజనీకి మహేశ్ బాబు గ్రీటింగ్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తలైవా సర్.. హ్యాపీ బర్త్ డే: రజనీకి మహేశ్ బాబు గ్రీటింగ్స్

  • 69 వ‌సంతంలోకి అడుగుపెట్టిన రజనీ
  • మహేశ్ శుభాకాంక్షలు
  • ఈ ఏడాది మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలి
సౌతిండియా సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ఈ రోజు 69వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనకు సినీనటుడు మహేశ్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'మా త‌లైవా ర‌జ‌నీకాంత్ స‌ర్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఈ ఏడాది మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాల‌ని నేను కోరుకుంటున్నాను. మీపై ప్రేమ‌, గౌరవం మాకు ఎప్ప‌టికీ వుంటాయి' అని ట్వీట్‌ చేశారు.

రజనీకాంత్‌ని స్టైల్‌కే స్టైల్‌ నేర్పించే మాస్టర్‌గా ఆయన అభిమానులు కొనియాడతారు. ఆయ‌న పుట్టినరోజుని పండుగలా జ‌రుపుకుంటున్నారు. పలువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కి సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్బార్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
Rajinikanth
Mahesh Babu
Tollywood

More Telugu News