విందుపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు
- నేను ఎన్నో పార్టీలకు హాజరవుతుంటా
- వాటికి వెళ్లేందుకు ఎవరి పర్మిషను తీసుకోలేదు
- ఇప్పుడు నేనిచ్చే విందుకు అనుమతి ఎందుకు?
కాగా, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిన్న రాత్రి రఘురామ కృష్ణంరాజు సహచర ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని న్యూ ఎంపీ క్వార్టర్స్‌లోని వెస్ట్రన్ కోర్టులో ఇచ్చిన ఈ విందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఎంపీలు హాజరయ్యారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు కూడా విందుకు హాజరయ్యారు.