వాంఖెడేలో పోటాపోటీగా సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాట్స్ మెన్.. స్కోరు 240/3
- రెచ్చిపోయిన భారత టాపార్డర్
- ఫిఫ్టీలు సాధించిన రోహిత్, రాహుల్, కోహ్లీ
- 16 సిక్సర్లు నమోదు
ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆటతీరే హైలైట్. అత్యధిక ఓవర్లు ముగిసిన తర్వాత బరిలో దిగినా విపరీతమైన దూకుడుతో కేవలం 29 బంతుల్లోనే 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ సైతం విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశాడు.