యువ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు మరోసారి మొండిచేయి
- తొలి రెండు టి20ల్లో దక్కని చాన్స్
- వన్డే టీమ్ లోనూ నో ప్లేస్
- ఇంకా కోలుకోని ధావన్
- ధావన్ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసిన సెలెక్టర్లు
వాస్తవానికి విండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు కొన్నిరోజుల కిందటే జట్టును ప్రకటించారు. అప్పుడు శాంసన్ ను ఎంపిక చేయలేదు. అయితే గాయపడిన శిఖర్ ధావన్ ఇప్పటికీ కోలుకోకపోవడంతో అతడిస్థానంలో శాంసన్ ను తీసుకుంటారని భావించినా, సెలెక్టర్లు మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గారు. టెస్టుల్లో పరుగులు వెల్లువెత్తిస్తున్న మయాంక్ ను ధావన్ ప్లేస్ లో ఓపెనింగ్ చేయించే అవకాశాలున్నాయి. మొత్తానికి మరోసారి సంజూ శాంసన్ కు తీవ్ర నిరాశ తప్పలేదు.