గూగుల్ సెర్చ్ లో తిరుగులేని అభినందన్!
- అత్యధికులు వెదికింది ఈ పోరాట యోధుడ్నే!
- జాబితా విడుదల చేసిన గూగుల్ ఇండియా
- రెండో స్థానంలో లతా మంగేష్కర్
ఓ సీజన్ లో అభినందన్ పేరు విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ వింగ్ కమాండర్ కు చెందిన వార్తలు, వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో అధికభాగాన్ని ఆక్రమించాయి. ఇక గూగుల్ ఇండియా విడుదల చేసిన టాప్ సెర్చ్ జాబితాలో అభినందన్ వర్ధమాన్ తర్వాత రెండో స్థానంలో గానకోకిల లతా మంగేష్కర్, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇటీవల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ప్లాట్ ఫామ్ గాయని రాణు మోండాల్ టాప్-10లో చోటు దక్కించుకుంది. ఆమె ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.