ఎన్కౌంటర్ స్థలానికి విదేశీ మీడియా
- ఘటనా స్థలాలను పరిశీలించిన ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రతినిధులు
- ఫొటోలు, వీడియోలు తీసుకున్న బృందం
- ఎన్హెచ్ఆర్సీకి పూర్తి నివేదిక సమర్పించిన శంషాబాద్ పోలీసులు
మరోవైపు, ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని నిన్న విదేశీ మీడియా ప్రతినిధులు సందర్శించారు. అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు చెందిన సౌత్ ఏషియా ప్రతినిధి జెఫ్రే గెటిల్‌మేన్ ఆధ్వర్యంలో ముగ్గురు పాత్రికేయులు ఘటనా స్థలాలను పరిశీలించారు. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన దిశ దహనం, హంతకుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఈ బృందం వీడియోలు, ఫొటోలు తీసుకుంది.