రాజధాని విషయంలో నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: ఏపీ మంత్రి బొత్స

  • మేం రాజధానిని అభివృద్ధి చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం
  • కనీసం 5వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదు
  • పత్రికల్లో వ్యతిరేక వార్తల్ని వీరే రాయిస్తారు
రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఏపీ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని మాత్రమే తాను అన్నానని, అయితే కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలోనే ఉన్నామని, గత ప్రభుత్వం తెచ్చిన లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులో నుంచి కనీసం 5 వేల కోట్లు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయలేదని, ఈ విషయాన్ని వారు మర్చిపోతే ఎలా? అంటూ ఎద్దేవా చేశారు. వ్యతిరేక వార్తల్ని వీరే పత్రికల్లో రాయించి, అవే వార్తలను పట్టుకుని గందరగోళం సృష్టిస్తారని ఈ సందర్భంగా బొత్స అన్నారు.
Go Back to Shorts
botsa
ap assembly sessions
ap capital

More Telugu News