Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా నాని?

  • 'వెంకీమామ'గా వస్తున్న వెంకటేశ్ 
  • 'అసురన్' రీమేక్ కి సన్నాహాలు 
  • ఆకుల శివ కథకి ఓకే చెప్పిన సురేశ్ బాబు
కొంతకాలంగా వెంకటేశ్ మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆ మధ్య 'ఎఫ్ 2' చిత్రంతో హిట్ కొట్టేసిన వెంకటేశ్, ఈ నెల 13వ తేదీన 'వెంకీమామ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'అసురన్' రీమేక్ లో చేయనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

ఆ తరువాత ప్రాజెక్టుకి కూడా రంగం సిద్ధమవుతుందనేది తాజా సమాచారం. ఇటీవల ఆకుల శివ వినిపించిన ఒక కథ సురేశ్ బాబుకి బాగా నచ్చిందట. ఈ మల్టీస్టారర్ కథలో, ఒక కథానాయకుడిగా వెంకటేశ్ .. మరో కథానాయకుడిగా నాని పేర్లు వినిపిస్తున్నాయి. నాని అయితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని సురేశ్ బాబు వ్యక్తం చేశారట. గతంలో నాగార్జునతో 'దేవదాసు' చేసిన నాని, వెంకటేశ్ తోను కలిసి కనిపిస్తాడన్న మాట.
Venkatesh
Nani

More Telugu News