ఐసీయూలో ల‌తా మంగేష్క‌ర్ తో ఫొటో దిగిన నర్సులు
Add ap7am to your home Screen

ఐసీయూలో ల‌తా మంగేష్క‌ర్ తో ఫొటో దిగిన నర్సులు

  • గత నెల ఆసుపత్రిలో చేరిన ల‌తా మంగేష్క‌ర్
  • సుమారు నెల రోజుల పాటు ఐసీయూలో చికిత్స 
  • కోలుకున్న గానకోకిల  
అనారోగ్య కారణాలతో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ గత నెల ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె కోలుకున్న తర్వాత ఆమెతో కొందరు నర్సులు దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ముగ్గురు నర్సులు చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఈ ఫొటో వైరల్ అవుతోంది. లతా మంగేష్కర్ ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

సుమారు నెల రోజుల పాటు ఐసీయూలో ఆమెకు వైద్యులు చికిత్స అందించడంతో కోలుకున్నారు. తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. లతా మంగేష్కర్ త‌న‌ కెరీర్‌లో 26,000కు పైగా పాటలు పాడారు. 2001లో ఆమె భార‌త‌ర‌త్న పుర‌స్కారం అందుకున్నారు.
Lata Mangeshkar
Bollywood
Tollywood

More Telugu News