ప్రవాస భారతీయులను చూసి నేర్చుకోండి: పాకిస్థానీలకు ఇమ్రాన్ ఖాన్ హితవు
- పాక్ లో అవినీతి వ్యతిరేక దినోత్సవం
- ఇస్లామాబాద్ లో కార్యక్రమం ఏర్పాటు
- హాజరైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
యువత విద్యావకాశాలపైనా, ఉన్నత విద్య, పరిశోధన రంగాలపైనా ఖర్చు చేయాల్సిన ధనం, సముద్ర తీరాల్లో విలాసవంతమైన భవనాల నిర్మాణానికి, బ్యాంకు అకౌంట్లను మరింత నింపడానికి తరలిపోతోందని ఇమ్రాన్ ఆరోపించారు.
"విదేశాల్లో ఉన్న భారతీయులు, చైనీయులు తమ తమ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా ఆయా దేశాల ఆర్థికవ్యవస్థలు దూసుకుపోతున్నాయి. విదేశాల్లో ఉన్న పాకిస్థానీలను మనకున్న గొప్ప ఆస్తిగా భావిస్తున్నాం. కానీ వారు దేశంలోని అవినీతి, లంచగొండితనం చూసి పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.