బన్నీతో సినిమా చేయాలని నాకూ వుంది: 'వెంకీమామ' దర్శకుడు
- వినోదభరిత చిత్రంగా 'వెంకీమామ'
- ఈ నెల 13వ తేదీన విడుదల
- అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానన్న బాబీ
బయట వెంకటేశ్ గారిని చైతూ 'వెంకీమామ' అని పిలుస్తాడట. ఈ సినిమాలోనూ వాళ్లిద్దరి మధ్య అదే వరస ఉంటుంది గనుక, ఆ టైటిల్ ను ఫిక్స్ చేశాను. టైటిల్ కి మంచి మార్కులు పడ్డాయి. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. నా తదుపరి సినిమా బన్నీతో వుంటుందనే టాక్ నా వరకూ వచ్చింది. బన్నీతో ఒక సినిమా చేయాలని నాకూ వుంది. అలాంటి అవకాశం కోసమే నేను కూడా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.