Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిరామ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సురేశ్ బాబు

  • వెంకటేశ్ హీరోగా 'అసురన్' రీమేక్ 
  • నటనలో శిక్షణ తీసుకుంటున్న అభిరామ్ 
  • సోలో హీరోగానే అభిరామ్ పరిచయం 
రానా సోదరుడు అభిరామ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయన ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందా అనే ఆసక్తి దగ్గుబాటి అభిమానులలో వుంది. ఈ నేపథ్యంలోనే 'అసురన్' రీమేక్ లో ఆయన కనిపించనున్నట్టు కొన్ని రోజులుగా ఒక టాక్ వినిపిస్తోంది. వెంకటేశ్ కథానాయకుడిగా 'అసురన్' రీమేక్ ను రూపొందించడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో వెంకటేశ్ చిన్న కొడుకుగా అభిరామ్ పరిచయం కానున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సురేశ్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా అభిరామ్ ను పరిచయం చేసే ఉద్దేశం లేదనీ, సోలో హీరోగానే అభిరామ్ ను పరిచయం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అభిరామ్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని అన్నారు. మొత్తానికి అభిరామ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందన్న మాట.
Abhiram
Suresh Babu

More Telugu News