వైసీపీ నారీమణులు తమ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ నారీమణులు తమ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫైర్

  • వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ రేప్ కేసులో నిందితుడు
  • రాజమండ్రి ఎంపీ భరత్ వేధింపుల కేసులో నిందితుడు
  • ఇలాంటి పార్టీలో ఉన్న వీళ్లా మహిళల గురించి మాట్లాడేది?
వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నిప్పులు చెరిగారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో వైసీపీ నారీమణులు తమ ఇష్టానుసారం మాట్లాడారని, మహిళలపై వాళ్లకే ప్రేమ ఉన్నట్టు, ఎవరికీ లేనట్టుగా మాట్లాడారని విమర్శించారు.

వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ ఓ రేప్ కేసులో నిందితుడని, రెండు నెలలు జైల్లో ఉండొచ్చాడని, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వరకట్న వేధింపుల కేసులో నిందితుడని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా అధికారిణి ఇంటికి వెళ్లి బెదిరించారని.. అటువంటి వ్యక్తులున్న పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఒంగోలులో మైనార్టీ బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారానికి పాల్పడితే బాధితురాలిని హోం మంత్రి పరామర్శించలేకపోయారని, నిందితుడిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ నిప్పులు చెరిగారు.
YSRCP
Telugudesam
Panchumarthi Anuradha

More Telugu News