వారం రోజుల్లో 10 ఉరితాళ్లు సిద్ధం చేయాలంటూ బక్సర్ జైలుకు సందేశం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారం రోజుల్లో 10 ఉరితాళ్లు సిద్ధం చేయాలంటూ బక్సర్ జైలుకు సందేశం!

  • నిర్భయ నిందితులకు త్వరలో ఉరి!
  • ఉరితాళ్ల తయారీకి పేరుగాంచిన బక్సర్ జైలు
  • జైళ్ల డైరెక్టరేట్ నుంచి బక్సర్ జైలుకు సందేశం
నిర్భయ నిందితులకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లోని బక్సర్ జైలుకు ఓ సందేశం వచ్చింది. డిసెంబరు 14 నాటికి 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలన్నది ఆ సందేశంలోని సారాంశం. ఉరితాళ్లను రూపొందించడంలో బక్సర్ జైలుకు ఎంతో పేరుంది. పార్లమెంటు దాడుల సూత్రధారి అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఉపయోగించిన తాడును కూడా ఈ జైల్లోనే తయారుచేశారు.

తాజాగా, మరోసారి ఉరితాళ్లు పంపించాలని జైళ్ల డైరెక్టరేట్ నుంచి వచ్చిన సందేశం ద్వారా ఆ ఉరితాళ్లు నిర్భయ నిందితుల కోసమేననని భావిస్తున్నారు. దీనిపై బక్సర్ జైలు సూపరింటిండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ, ఉరితాళ్లు తయారుచేయాలంటూ సూచనలు వచ్చింది నిజమేనని, వాటిని ఎవరి కోసం ఉపయోగిస్తారన్నది తమకు తెలియదని స్పష్టం చేశారు.
Hanging Rope
Death
Buksar
Bihar
Prison
Nirbhaya
New Delhi

More Telugu News