తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం
- గద్వాల మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘటన
- రైతును అడ్డుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది
- తన భూమి సమస్య పరిష్కరించడం లేదని రైతు ఆవేదన
తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను శరీరంపై పోసుకున్న రైతు శేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమి సమస్య పరిష్కరించడం లేదని రైతు ఆవేదన చెందాడు. అతడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు నచ్చజెప్పారు.