ఏయ్, అరవకు... పద్ధతా ఇది!... కార్యకర్తలపై సహనం కోల్పోయిన పవన్ కల్యాణ్
- తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన
- మండపేటలో రైతులతో సమావేశం
- భారీగా హాజరైన జనసైనికులు
"మీకే చెప్పేది... దయచేసి ఈలలు, చప్పట్లు ఆపాలి. మీరిలా అరుస్తుంటే నేనొచ్చిన పని జరగదు! నేనో పార్టీని నడుపుతున్నా, సమస్యలు వినాలి. ఏయ్ అరవకు... నీకే చెప్పేది, పద్ధతా ఇది! మీరు క్రమశిక్షణతో ఉంటే నేను ఓడిపోయేవాడ్ని కాదు. రైతన్న కష్టాలు గురించి మాట్లాడుతుంటే మీరు అరుస్తుంటే ఎలా? క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.