హోటల్ నుంచి వార్తాపత్రికలో పార్సిల్ తీసుకెళ్తున్నారా?.. జాగ్రత్త అంటోన్న అధికారులు
- భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ అధికారుల హెచ్చరిక
- వార్తాపత్రికల సిరా రంగుల్లో కేన్సర్ కారకాలు
- వినియోగదారుడికి కేన్సర్ వచ్చే ప్రమాదం
- రోగనిరోధక శక్తి తగ్గుదల
వార్తాపత్రికల సిరా రంగుల్లో కేన్సర్ కారకాలు ఉంటాయని, వాటిల్లో ఆహారపదార్థాలను తీసుకెళ్లడం వల్ల వినియోగదారుడికి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆ సంస్థ అధికారులు చెప్పారు. అంతేగాక, వార్తా పత్రికల్లో ఆహారం తింటే పిల్లలు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుందని, ఈ రసాయనాలు జీర్ణక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు.