Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ సినిమాలో తప్పకుండా నటిస్తా: డ్వేన్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు!

  • 'జుమాంజీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్న ది రాక్
  • భారత చిత్ర పరిశ్రమంటే ఎంతో ఇష్టం
  • ఇక్కడి ఫ్యాన్స్ కోసం యాక్షన్ సినిమా చేస్తానని వెల్లడి
హాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన డ్వేన్ జాన్సన్, తాను ఎప్పుడోకప్పుడు బాలీవుడ్ సినిమాలో తప్పకుండా నటిస్తానని వ్యాఖ్యానించారు. తాను నటించిన 'జుమాంజీ' చిత్రం ఇండియాలో పలు భాషల్లో విడుదలైన సందర్భంగా మాట్లాడిన జాన్సన్, తనకు భారత చిత్ర పరిశ్రమంటే ఎంతో ఇష్టమని అన్నారు. తనకు ఇండియాలో ఎంతో మంది అభిమానులు ఉన్నారని, వారు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టుకోబోనని, తప్పకుండా భారత సినిమాల్లో నటిస్తానని, అది ఎప్పటికి సాధ్యమన్న విషయాన్ని మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేనని అన్నారు.

ప్రియాంకా చోప్రాతో కలిసి 'బేవాచ్'లో కనిపించిన జాన్సన్ కు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ మంచి మిత్రుడు. బాలీవుడ్ లో తాను నటించే సినిమా యాక్షన్ మూవీ అయితేనే బాగుంటుందని అన్నారు. కాగా, రెజ్లింగ్ లో 'ది రాక్'గా ఎన్నో మ్యాచ్ లను గెలిచి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న డ్వేన్ జాన్సన్, ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ గా ఎదిగి ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. ఆయన నటించిన 'ది మమ్మీ రిటర్న్', 'జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్', 'హెర్కులెస్', 'స్నిచ్', 'మోనా', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' తదితర చిత్రాలు ఇండియాలో ఎన్నో భాషల్లో విడుదలయ్యాయి.
Dwane Johnson
Hindi Movie
Bollywood
Jumanji

More Telugu News