ఈసారీ వాడి...వేడిగానేనా? : రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
- పది రోజుల పాటు జరగనున్న సభ
- కీలక అంశాలను చర్చకు తేనున్న ప్రభుత్వం
- సర్కారును కడిగిపారేయాలని విపక్షం అస్త్రాలు
పలు కీలక అంశాలను చర్చకు ఉంచడంతోపాటు మూడు నుంచి ఐదు బిల్లులను సభ ఆమోదానికి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమం, తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయడం, ప్రభుత్వ పనుల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్, నామినేటెడ్ పదవులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా నిలదీసేందుకు విపక్ష టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది.