మస్తాన్ రావు, నేను కలిసి చదువుకున్నాం: విజయసాయిరెడ్డి
- టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు
- జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
- స్పందించిన విజయసాయిరెడ్డి
టీడీపీకి గుడ్ బై చెప్పిన నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్ రావు ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ సిద్ధాంతాలను నమ్మి బీద మస్తాన్ రావు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మస్తాన్ రావు తనకు బాల్యమిత్రుడని, ఇద్దరం కలిసి చదువుకున్నామని విజయసాయి వెల్లడించారు. కాగా, వైఎస్ జగన్ సమక్షంలో బీద మస్తాన్ రావు వైసీపీలో చేరిన సమయంలో విజయసాయి కూడా అక్కడే ఉన్నారు. విజయసాయి భరోసా మీదటే బీద మస్తాన్ రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్టు అర్థమవుతోంది.