న్యాయ ప్రక్రియ ప్రతీకార రూపంలో ఉండరాదు: సుప్రీంకోర్టు సీజే బాబ్డే
- రేప్ కేసుల్లో సత్వర న్యాయం అందించాలన్న కేంద్ర మంత్రి
- ఆ వ్యాఖ్యలతో విభేదించిన బాబ్డే
- నేరానికి హడావిడిగా శిక్ష విధిస్తే న్యాయానికి అర్ధముండదు
రాజస్థాన్ లోని జోద్ పూర్ లో హైకోర్టు భవనం ప్రారంభోత్సవంలో బాబ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేప్ కేసుల్లో సత్వర తీర్పులు చెప్పాలన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలతో సీజేఐ విభేదించారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకత కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యాయం అనేది ప్రతీకారంగా మారకూడదని చెప్పారు. నిందితుడు నేరం చేశాడన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్న నేపథ్యంలో బాబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం నిందితులకు కూడా కొన్ని హక్కులుంటాయని ఆయన అన్నారు.