7వ స్థానంతో యూట్యూబ్ లో దూసుకుపోతున్న 'రౌడీబేబీ' సాంగ్
- రికార్డులు బద్దలు కొడుతున్న రౌడీ బేబీ
- స్వయంగా ప్రకటించిన యూట్యూబ్
- ధనుష్, యువన్, ప్రభుదేవాల కృషి ఫలితం
ఇప్పటి వరకూ 716 మిలియన్ వ్యూస్ ను అధిగమించి దూసుకుపోతూ యూట్యూబ్ రికార్డుల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ స్వయంగా రాసి, పాడిన ఈ పాటకు స్వరకర్త యువన్ శంకర్ రాజా కాగా, అదిరి పోయే స్టెప్పులను ప్రముఖ కొరియో గ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా అందించారు. ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ టాప్ 7లో నిలిచి రికార్డులను సృష్టించిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం.