'ఎన్ కౌంటర్' చేసిన హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం
- ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందన
- మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు
- వివరాలు కోరిన మానవ హక్కుల సంఘం
దీనిపై తమకు సమాధానం చెప్పాలని సూచించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది. కాగా, దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. కొందరు మాత్రం పోలీసుల చర్యను వ్యతిరేకిస్తున్నారు. కాసేపట్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.