'ఎన్ కౌంటర్'పై ఏ విచారణ అక్కర్లేదు.. పోలీసులు భయపడాల్సిన అవసరం లేదు: రాజాసింగ్
- పోలీసులను ఎంతో మంది తిట్టారు
- అందులో నేనూ ఒకడిని
- పోలీసులకు హ్యాట్సాఫ్
- దేశ మంతా పోలీసులకు మద్దతుగా ఉంది
తెలంగాణ పోలీసులను చూసి ప్రతి రాష్ట్రం నేర్చుకోవాలని, భారత్ లో వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి రాష్ట్రంలోని పోలీసులు ఈ విధంగా చర్యలు తీసుకుంటే మహిళలపై దౌర్జన్యాలు ఆగిపోతాయని ఆయన తెలిపారు. పోలీసులు చేసిన ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారని ఆయన తెలిపారు. ఏ విచారణా అవసరం లేదని, పోలీసులు భయపడాల్సిన అవసరం లేదని, దేశ మంతా వారి వెంటే ఉందని వ్యాఖ్యానించారు.