'హీరో' సీపీ సజ్జనార్.. మీకు సెల్యూట్.. విపరీతంగా వైరల్ అవుతోన్న 'గన్ పట్టుకున్న సైబరాబాద్ కమిషనర్' ఫొటో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హీరో' సీపీ సజ్జనార్.. మీకు సెల్యూట్.. విపరీతంగా వైరల్ అవుతోన్న 'గన్ పట్టుకున్న సైబరాబాద్ కమిషనర్' ఫొటో

  • 'మీకు సెల్యూట్ సర్' అంటూ నెటిజన్ల ప్రశంసల వర్షం 
  • ఉదయం నిద్రలేవగానే చల్లని వార్తను వినేలా చేశారు సర్ అంటూ హర్షం
  • సైబరాబాద్ పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ల వర్షం
దిశపై హత్యాచారం కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ను సోషల్ మీడియాలో 'హీరో'గా పేర్కొంటున్నారు. గతంలో ఆయన తుపాకీ పట్టుకోగా తీసిన ఫొటో ఇప్పుడు ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ ఆయనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో అని పేర్కొంటున్నారు.

'మీకు సెల్యూట్ సర్' అని సీపీ సజ్జనార్ ఫొటోను పోస్ట్ చేస్తూ కొందరు ట్వీట్లు చేశారు. 'ఉదయం నిద్రలేవగానే చల్లని వార్తను వినేలా చేశారు సర్.. మీరు నిజమైన హీరో. సైబరాబాద్ పోలీసులకు హ్యాట్సాఫ్' అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. 'భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఈ ఫొటోను గుర్తు తెచ్చుకోండి' అని ఒకరు పేర్కొన్నారు. సీపీ సజ్జనార్ ఫొటోను పోస్ట్ చేసి కొందరు సినిమా డైలాగులనూ పోస్ట్ చేస్తున్నారు.
cp
cyberabad
Disha
Hyderabad

More Telugu News