'చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం
- తుళ్లూరులో జరుగుతున్న సమావేశం
- రాజధాని రైతులు, రైతు కూలీలు, వైసీపీ ఎమ్మెల్యేల హాజరు
- టీడీపీ హయాంలో తమకు అన్యాయం జరిగిందన్న రైతులు
చంద్రబాబు బంధువులకు కూడా రాజధానిలో భూములు ఉన్నాయని, ఈ భూములను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. రైతులను చంద్రబాబు మోసం చేశారని, ల్యాండ్ పూలింగ్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని రైతు సంఘం నేత శేషగిరిరావు ఆరోపించారు. సీఆర్డీఏలో ఎన్నో అవకతవకలు జరిగాయని, రైతులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మరచిపోమని అన్నారు. రాజధాని పేరుతో రూ.58 వేల కోట్లు దోచేశారని ఆరోపించిన శేషగిరిరావు, రైతులకు న్యాయం జరగాలని కోరారు.