చంద్రయాన్-2 ప్రయోగంతో దేశానికి చెడ్డపేరు వచ్చింది: లోక్ సభలో తృణమూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
- విక్రమ్ ల్యాండర్ కూలిపోవడంతో చెడ్డ పేరు వచ్చింది
- దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
- అంతరిక్ష ప్రయోగాలకు అదనపు నిధులు కేటాయించడం సరికాదు
సౌగతారాయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. మీనాక్షి లేఖి మాట్లాడుతూ, ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. గత సెప్టెంబర్ 7న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన సంగతి తెలిసిందే.