పవన్ గురించి ఏం మాట్లాడాలి నేను... సారీ: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా
- పవన్ రెండు చోట్ల ఓడిపోయారు
- ఆయన గురించి నేనేం మాట్లాడతానన్న చెవిరెడ్డి
ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు స్పందిస్తూ, ఒంటినిండా తిక్క ఉన్న ఓ పిచ్చోడు తమ నాయకుడు జగన్ ను గుర్తిస్తే ఎంత? గుర్తించకుంటే ఎంత? అని మండిపడ్డారు. చంద్రబాబు పెంపుడు ప్యాకేజీగా జగన్ మారిపోయాడని ఆరోపించారు. ఓసారి హిందువుల గురించి, మరోసారి క్రిస్టియన్ల గురించి మాట్లాడుతున్న పవన్, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తున్నారని అన్నారు. పవన్ కు ధైర్యముంటే, తన రష్యన్ భార్యకు పుట్టిన కుమార్తె పాస్ పోర్టులో కులం పేరు ఏముందో చెప్పాలని నిలదీశారు.