Visakhapatnam - Gajuwaka: విశాఖలో దారుణం.. వివాహితపై యాసిడ్ దాడి
విశాఖ పట్టణం నగరంలోని గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ మహిళపై ఓ దుండగుడు యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు ఆమెను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. మహిళ ముఖం, చేతులు కాలినట్లు వైద్యులు గుర్తించారు.