రాష్ట్రంలో పాలన ఇలాగే సాగితే.. దివాల తీయడం ఖాయం: చంద్రబాబు
- అభివృద్ధిపై ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు
- వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లోనే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది
- సంపద సృష్టి నిలిచిపోయింది
రాష్ట్రంలో అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. తమ పాలనలో సంపద సృష్టి చేశామని చెబుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. ఏడునెలలుగా అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఖర్చుపెట్టలేదన్నారు. మూలధన వ్యయం అన్నది అతి ముఖ్యమని.. ప్రస్తుతం అది జరగటంలేదని పేర్కొన్నారు. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నీరుగార్చిందన్నారు.