ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్షల షెడ్యూల్ వివరాలు!

  • మార్చి 23 నుంచి మొదలు
  • ఏప్రిల్ 8 వరకూ పరీక్షలు
  • షెడ్యూల్ విడుదల చేసిన మంత్రులు సురేశ్, అనిల్ కుమార్
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకూ పరీక్షలు జరుగుతాయి. మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్ లు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు.

మార్చి 23న ప్రథమ భాష పేపర్ -1 (గ్రూప్-ఏ, కాంపోజిట్ కోర్సు), 24న ప్రథమ భాష పేపర్ - 2 (గ్రూప్-ఏ, కాంపోజిట్ కోర్సు, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1), 26న ద్వితీయ భాష, 27న ఇంగ్లీష్ పేపర్ - 1, 28న ఇంగ్లీష్ పేపర్ - 2, 30న గణితం పేపర్ - 1, 31న గణితం పేపర్ - 2 పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్ 1న జనరల్ సైన్స్ పేపర్ - 1, 3న జనరల్ సైన్స్ పేపర్ - 2, 4న సోషల్ స్టడీస్ పేపర్ - 1, 6న సోషల్ స్టడీస్ పేపర్ - 2, 7న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 2, 8న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ జరుగుతాయి. ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష మాత్రం ఉదయం 11.30 గంటల వరకూ జరుగుతుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Tenth
Exams
Schedule

More Telugu News