సినిమాల్లో ప్రొడ్యూసర్లకు, ఇక్కడ చంద్రబాబుకు పవన్ కాల్షీట్స్ ఇస్తారు: మంత్రి పేర్ని నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాల్లో ప్రొడ్యూసర్లకు, ఇక్కడ చంద్రబాబుకు పవన్ కాల్షీట్స్ ఇస్తారు: మంత్రి పేర్ని నాని

  • సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన నటుడే
  • పవన్ నాయుడుని ప్రజలు గుర్తించలేదు
  • రోజుకో మాట.. గంటకో మాట.. పూటకో మాట మాట్లాడతాడు
ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల ఘాటు స్పందనలు కొనసాగుతున్నాయి. ‘జనసేన’ను బీజేపీలో విలీనం చేసే పనిలో పవన్ కల్యాణ్ ఉన్నారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మంత్రి పేర్ని నాని కూడా పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ ప్రజానాయకుడు కాదని, సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన నటుడేనని విమర్శించారు. పవన్ కు రాజకీయ పరిపక్వత అవసరమని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని అన్నారు.

‘పవన్ నాయుడుని రాజకీయనాయకుడిగా మేము గుర్తించట్లేదు. మమ్మల్ని గుర్తించమని మేము ఏమన్నా ఏడ్చామా? మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు, నిన్ను గుర్తించలేదు. కనుక, ఉనికి చాటుకోవడం కోసం లేదా తీసుకున్న రెమ్యూనరేషన్ కోసం ఇవన్నీ తిప్పలు తప్పితే వేరే ఏం లేదు. సినిమాల్లో ప్రొడ్యూసర్లకు, ఇక్కడ చంద్రబాబుకు ఆయన (పవన్) కాల్షీట్స్ ఇస్తారు’ అని తీవ్ర విమర్శలు చేశారు.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రోజుకో మాట.. గంటకో మాట.. పూటకో మాట మాట్లాడారని విమర్శించారు. ఇలా మాటలు మార్చే వారిని ఏమంటారు? అని ప్రశ్నించారు. ‘తెలుగు భాషా పండితుడు ఆయనే కాబట్టి ఆయన్ని ఏమంటారో ఆయనే తెలుసుకుంటే సరిపోతుంది’ అని విమర్శించారు.
Janasena
Pawan Kalyan
YSRCP
Perni Nani

More Telugu News