వెటర్నరీ డాక్టర్ హత్యోదంతంపై కేసీఆర్ ప్రకటన విడ్డూరంగా ఉంది: విజయశాంతి
- సంచలనం సృష్టించిన పశువైద్యురాలి ఘటన
- మూడ్రోజుల తర్వాత స్పందించారంటూ కేసీఆర్ పై విజయశాంతి ఆగ్రహం
- మొక్కుబడి ప్రకటనతో సరిపెట్టారంటూ విమర్శలు
వెటర్నరీ వైద్యురాలి కుటుంబసభ్యుల పట్ల బాధ్యత లేకుండా మాట్లాడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కేసీఆర్ చెప్పలేదని, ఫిర్యాదు అందిన వెంటనే మా పరిధి కాదు అంటూ జరిగే జాప్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించకుండా కేసీఆర్ తప్పించుకున్నారని విజయశాంతి ఆరోపించారు.