Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్ అంజలి మంచి అమ్మాయి.. కానీ, హీరో జై ఆమెను పూర్తిగా మార్చేశాడు: నిర్మాత నందకుమార్

  • షూటింగ్ సందర్భంగా అంజలి, జైలకు రెండు రూమ్ లు బుక్ చేశాం
  • కానీ ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు
  • అంజలిని పేరుతో పిలిచినందుకు జై నానా రచ్చ చేశాడు
హీరో, హీరోయిన్ల మధ్య బంధాలు, అనుబంధాలపై రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కూడా కాదు. హీరోయిన్ అంజలి, తమిళ హీరో జై ప్రేమలో ఉన్నారంటూ అనేక కథనాలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి తాజాగా సినీ నిర్మాత నందకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంజలి చాలా మంచి అమ్మాయి అని... ఆమెను జై పూర్తిగా మార్చేశాడని నందకుమార్ చెప్పారు. జై కారణంగా తాను చాలా నష్టపోయాయని తెలిపారు. తమ సినిమా షూటింగ్ కొడైకెనాల్ లో జరుగుతున్నప్పుడు అంజలి, జైకు వేర్వేరుగా రూమ్ లను బుక్ చేశామని... కానీ, వారిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారని చెప్పారు. ఒక రూమ్ క్యాన్సిల్ చేద్దామంటే వద్దని చెప్పేవారని... దాని వల్ల తాను ప్రతి రోజు రూ. 12 వేలు నష్టపోయానని తెలిపారు.

ఒక రోజు షూటింగ్ లో అంజలిని మేడమ్ అని కాకుండా... అంజలి అని పిలిచినందుకు జై నానా రచ్చ చేశాడని నందకుమార్ చెప్పారు. అంజలి ఏమాత్రం ఫీల్ కాకున్నా... జై మాత్రం రెచ్చిపోయాడని అన్నారు. షూటింగ్ క్యాన్సిల్ చేస్తానని బెదిరించాడని... ఆ తర్వాత అంజలికి కడుపునొప్పి వచ్చిందని తీసుకుపోయాడని చెప్పారు. ఆ రకంగా ఆ రోజు షూటింగ్ ను చెడగొట్టాడని మండిపడ్డారు.
Anjali
Jai
Nanda Kumar
Tollywood
Kollywood

More Telugu News