పోలీసులకు టెస్ట్... స్పందిస్తారో, లేదోనని ఒక్కరోజులో 40 వేల ఫోన్ కాల్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసులకు టెస్ట్... స్పందిస్తారో, లేదోనని ఒక్కరోజులో 40 వేల ఫోన్ కాల్స్!

  • 100, 112 నంబర్లపై విస్తృత ప్రచారం
  • నిన్న ఒక్కరోజే సాయం కోరిన 40 వేల మంది
  • సకాలంలో పోలీసులు స్పందించారని కితాబు
  • మొబైల్ పోలీస్ యాప్ డౌన్ లోడ్ లు 30 వేలు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశ హత్యాచారం తరువాత, ఆపదలో ఉన్న వేళ, పోలీసులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లపై విస్తృతంగా ప్రచారం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో సైతం పోలీసులు 100, 112 నంబర్లపై ప్రచారం ప్రారంభించారు. తమ సహాయం కావాల్సి వస్తే, సంకోచించకుండా సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇక పోలీసులు తక్షణం స్పందిస్తారా? అనే సందేహం ఒకరు, ఇద్దరికి కాదు. ఏకంగా 40 వేల మందికి వచ్చింది. ఆదివారం ఒక్కరోజే 40 వేల మంది 112 నంబరుకు ఫోన్ చేసి పలు రకాల సహాయాలను కోరడం గమనార్హం. వారిలో అత్యధికులు పోలీసులు సకాలంలో స్పందిస్తున్నారని నిర్ధారించుకున్నారు. ఇక పోలీసు మొబైల్ యాప్ ను సైతం 30 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఇదిలావుండగా, ఏపీలోని వాట్స్ యాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న 9969777888 నంబరు పోలీసులది కాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. పోలీసు శాఖ పేరిట ప్రచారం అవుతున్న ఈ నంబర్ ను తాము ఇవ్వలేదని, దీన్ని వైరల్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఏపీలో పోలీసుల వద్ద 9121211100 వాట్స్ యాప్ నంబర్ ఉందని ఆయన స్పష్టం చేశారు. 100, 112లతో పాటు 181 నంబర్ ను కూడా మహిళలు వినియోగించుకోవచ్చన్నారు.
Gautam Sawang
Andhra Pradesh
Police
100
112

More Telugu News