హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మనాలి రాథోడ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మనాలి రాథోడ్

  • రవి అనే బిజినెస్ మేన్ ను పెళ్లాడిన మనాలి రాథోడ్
  • పెళ్లికి హాజరైన రాజశేఖర్, జీవిత
  • కొంత కాలంగా మనాలికి రాని సినీ ఆఫర్లు
సినీ నటి అర్చన ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఆమె బాటలోనే మరో హీరోయిన్ మనాలి రాథోడ్ కూడా అడుగులు వేసింది. రవి విజ్జత్ అనే ఓ బిజినెస్ మేన్ ను ఆమె పెళ్లాడింది. ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ కు చెందిన రాజశేఖర్, జీవిత, దర్శకుడు క్రిష్, హేమ తదితర కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.

ప్రముఖ దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రంతో పాటు 'ఓ స్త్రీ రేపురా' వంటి చిత్రాల్లో మనాలి నటించింది. ఆ తర్వాత ఆమెకు సినీ అవకాశాలు రాకపోవడంతో లైఫ్ సెటిల్ కావాలని నిర్ణయించుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినీ ప్రయాణం మళ్లీ కొనసాగుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.
Manali Rathod
Marriage
Tollywood

More Telugu News