Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్యను చితక్కొట్టిన తమిళ టీవీ నటుడు ఐశ్వర్ అరెస్ట్!

  • భార్య ఆస్తి పత్రాలతో రుణం
  • తిరిగి విడిపించడంలో విఫలం
  • అడిగినందుకు గృహహింస
తన భార్యను దారుణంగా హింసించినందుకు తమిళ టీవీ నటుడు ఐశ్వర్ రఘునాథన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఐశ్వర్ భార్య జయశ్రీ నృత్య దర్శకురాలు. ఈ జంట చెన్నైలోని తిరువాన్మయూర్, ఎల్‌బీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం, జయశ్రీకి చెందిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను తీసుకున్న ఐశ్వర్‌, వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు.

ఆ డబ్బులు తిరిగి కట్టి, పత్రాలను వెనక్కు తెచ్చే విషయంలో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు అవుతుండేవి., ఈ క్రమంలో శనివారం నాడు కూడా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఆగ్రహం పట్టలేకపోయిన ఐశ్వర్, తన భార్యను చితక్కొట్టాడు. దీంతో ఆమె గాయాలతో అడయార్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది, మహిళా పోలీసు స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేసి, ఐశ్వర్‌ రఘునాథన్‌ ను, అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
Tamil
Ishwar
Jayasri
Arrest
Police

More Telugu News