పుణ్యక్షేత్రంలో నిజాయతీ డ్రైవర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుణ్యక్షేత్రంలో నిజాయతీ డ్రైవర్

సహజంగా ఎవరికైనా అకస్మాత్తుగా కళ్ళ ముందు నోట్ల కట్టలు కనిపిస్తే పట్టలేనంత సంతోషానికి లోనవుతారు. ఎవరూ చూడకుంటే అది తమకు దక్కిన లక్ష్మీ కటాక్షంగా భావించి, చటుక్కున వాటితో చెక్కేస్తారు. కానీ అందరూ ఒకేలా వుండరు కదా! నిజాయతీని నమ్ముకున్న వారూ వుంటారు. తిరుపతిలో ఒక టాక్సీ డ్రైవర్ ప్రయాణికుడి సొమ్ము విషయంలో ఇలానే నిజాయతీగా వ్యవహరించాడు.

ఆదోనికి చెందిన భక్తుడు తిరుపతి వచ్చి ఒక టాక్సీ ఎక్కాడు. అందులో ఒక బ్యాగ్ మరిచి వెళ్ళాడు. తర్వాత ఆ బ్యాగును డ్రైవర్ గుర్తించగా అందులో 3 లక్షల రూపాల విలువ చేసే నగలు, నగదు కనిపించాయి. ఆ డ్రైవర్ నిజాయతీగా ఆ బ్యాగును అదే ప్రయాణికుడికి తిరిగి అప్పగించాడు.   

More Telugu News