అలా అనుకుని ఉంటే '100'కు ఫోన్ చేసేదాన్ని: దిశ సోదరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలా అనుకుని ఉంటే '100'కు ఫోన్ చేసేదాన్ని: దిశ సోదరి

  • పోలీసులకు కాకుండా చెల్లికి ఫోన్ చేసిన దిశ
  • ఇటువంటి నీచులు ఉంటారని అనుకోలేదు
  • ప్రమాదాన్ని ఊహించివుంటే ఫోన్ చేసేదాన్నని చెప్పిన దిశ సోదరి
నాలుగు రోజుల నాడు తాను ప్రమాదంలో ఉన్న సమయంలో తన చెల్లెలికి ఫోన్ చేసిన దిశకు పోలీసులకు ఫోన్ చేయాలన్న ఆలోచన రాకపొవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, దిశ చెల్లెలు స్పందించింది. ఎంతో మంది తానుగానీ, తన సోదరిగానీ డయల్-100కు ఫోన్ చేయాల్సిందని అంటున్నారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అక్క అంత సీరియస్ పరిస్థితిలో ఉంటుందని తాను ఊహించలేదని చెప్పింది.

ఈ లోకంలో ఇటువంటి నీచులు కూడా ఉంటారని అనుకోలేదని, ప్రమాదాన్ని ముందుగా తెలుసుకోలేకపోయానని అన్నారు. లేకుంటే తాను కచ్చితంగా 100కు ఫోన్ చేసివుండేదాన్నని చెప్పారు. తన సోదరి సైతం రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిందని తెలిపింది.
Disha
Priyanka
Police
Dial 100

More Telugu News