ఏపీలో రైతుకు రక్షణ కల్పించేందుకు ఫిర్యాదు విభాగం ప్రారంభం

  • ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం
  • రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఏర్పాటు
  • కడప జిల్లా డీఎస్పీ కార్యాలయంలో ప్రారంభం
ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతులకు పోలీసు రక్షణ కల్పించేందుకు ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేసింది. కడప జిల్లా డీఎస్పీ కార్యాలయంలో ఈ విభాగాన్ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాశ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ఇక్కడ ఫిర్యాదు చేస్తే పోలీసులు తక్షణ చర్యలు చేపడతారని అన్నారు. దీంతో పాటు, మహిళలకు సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్ విభాగాన్ని ప్రారంభించారు. మహిళ కోసం ప్రత్యేక రక్షక్ వాహనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడప ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ, ఆపదలో వున్న మహిళలు 100, 108 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
Go Back to Shorts
cuddapah
Farmers
police
DSP
Office

More Telugu News